అంచనాలను మించిన ఆర్థిక వృద్దిరేటు..FY24 లో GDP వృద్ది 8.2 శాతం

అంచనాలను మించిన ఆర్థిక వృద్దిరేటు..FY24 లో GDP వృద్ది 8.2 శాతం

2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) 7.8శాతం వృద్ధి చెందింది. వార్షికంగా చూస్తూ వాస్తవ GDP వృద్ధి 8.2శాతం వృద్ధిని సాధించింది. శుక్రవారం (మే31) సాయంత్రం విడుదల చేసిన నాల్గవ క్వార్టర్ GDP వృద్ధి డేటాలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే గత త్రైమాసికంలో (Q3) లో జీడీపీ వృద్ధి రేటు వార్షికంగా 6.7 శాతానికి తగ్గుతుందని వివిధ సర్వేలు అంచనా వేశాయి. ఊహించన విధంగా Q3లో GDP 8.4 శాతానికిి వృద్ధి చెందింది. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(FY25) లో భారత జీడీపీ 7 శాతం వృద్దిని నమోదు చేస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వార్షిక నివేదికలో తెలిపింది. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ..ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. రాబోయే సంవత్సరాల్లో ఇది US, చైనా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా. 

RBI ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థ 2023-24లో వేగంగా విస్తరించింది. వాస్తవ జీడీపీ వృద్ది గతేడాది 7.0 శాతం నుంచి 7.6 కి పెరిగింది. ఇది వరుసగా మూడో సంవత్సరం 7 శాతనికి పైగా వృద్ధి సాధించింది.