ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌ బరిలో ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌

ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌ బరిలో ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌ ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనేందుకు లైన్‌‌‌‌‌‌‌‌ క్లియర్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. అర్హత ప్రమాణాల్లో మినహాయింపు ఇచ్చేందుకు సెంట్రల్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీ అంగీకరించింది. ఆసియా ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌–8లో ఇండియా లేకపోవడంతో ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనేందుకు ఐవోఏ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. దీంతో ఈ విషయాన్ని ఆలిండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ (ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌).. స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్లింది. ఇందులో జోక్యం చేసుకోవాలని మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ స్టిమాక్‌‌‌‌‌‌‌‌ ఏకంగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. దాంతో, స్పోర్ట్స్​ మినిస్ట్రీ స్పందించింది. 

‘ఇటీవలి పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న అర్హత ప్రమాణాలను సడలించేందుకు మినిస్ట్రీ అంగీకరించింది. గేమ్స్‌‌‌‌‌‌‌‌లో మన ఫుట్​బాల్​టీమ్స్‌‌‌‌‌‌‌‌ మరింత మెరుగ్గా రాణిస్తాయని ఆశిస్తున్నాం’ అని స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ అనురాగ్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. ఆసియా ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌ వరుసగా 18, 11వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్నాయి. కాగా, విమెన్స్​ సాఫ్ట్ బాల్, మెన్స్ హ్యాండ్​ బాల్, మెన్స్ వాటర్‌‌‌‌ పోలో, బాస్కెట్​బాల్‌‌ 5x5 జట్లను ఆసియా గేమ్స్ నుంచి ఐఓఏ విత్​డ్రా చేసుకుంది.