ఉల్లి ఎగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఉల్లి ఎగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

భారత్ లో గతేడాది అక్టోబర్ లో ఉల్లి రేటు భారీగా పెరిగింది. రూ.40లు ఉండగా వారం రోజుల వ్యవధిలోనే రెట్టింపు అయింది. దీంతో కేంద్రం 2024 మార్చి 31 వరకు ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులను నిలిపివేయాలని డిసెంబర్ 8, 2023న ప్రకటించింది. అప్పటి నుంచి భారత దేశంలో పండిన ఉల్లి పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం లేదు. గురువారం (ఫిబ్రవరి 22)న కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఉల్లి ఎగుమతులకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతించినట్లు తెలిపారు. 

దీంతో మారిషస్, బ్రహెయిన్, భూటాన్ దేశాలకు 54,760 టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేయాలని నిర్ణయించుకుంది.  బంగ్లాదేశ్‌కు 50,000 టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, బహ్రెయిన్‌కు 3,000 టన్నులు, భూటాన్‌కు 560 టన్నుల ఉల్లిని తక్షణమే ఎగుమతి చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.