IIT హైదరాబాద్లో ఇంటర్వ్యూలు.. ఎక్స్పీపిరియన్స్ లేకున్న ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

IIT హైదరాబాద్లో ఇంటర్వ్యూలు.. ఎక్స్పీపిరియన్స్ లేకున్న ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

ఇండియన్  ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, హైదరాబాద్  డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. 

పోస్టులు: డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ 

ఎలిజిబిలిటీ: ఇంటర్న్​షిప్‌తో కూడిన ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉండాలి.  మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ఏడాది పని అనుభవం తప్పనిసరి. ఫ్రెషర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

వాక్ ఇ న్ ఇంటర్వ్యూ: హాస్పిటల్, ఐఐటీ హైదరాబాద్, కంది, సంగారెడ్డిలో నవంబర్ 21న ఉదయం 9.45 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

పూర్తి వివరాలకు  www.iith.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.