సుల్తాన్ జొహార్ కప్‌‌‌‌ సెమీఫైనల్లో ఇండియా

సుల్తాన్ జొహార్ కప్‌‌‌‌ సెమీఫైనల్లో ఇండియా

జొహొర్ బాహ్రు (మలేసియా): సుల్తాన్ జొహార్ కప్‌‌‌‌లో ఇండియా జూనియర్ మెన్స్ హాకీ టీమ్‌‌‌‌ సెమీఫైనల్ చేరుకుంది. అమన్‌‌‌‌దీప్‌‌‌‌ లక్రా హ్యాట్రిక్ గోల్స్‌‌‌‌తో విజృంభించడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా 6–2తో న్యూజిలాండ్‌‌‌‌ను చిత్తు చేసింది. లక్రా 2, 7, 35వ నిమిషాల్లో గోల్స్‌‌‌‌ చేసి హ్యాట్రిక్‌‌‌‌ సాధించాడు.  

అరుణ్ సహాని (12వ, 53వ ని.) రెండు, పూవన్న చందుర  (52వ) ఓ గోల్ కొట్టాడు. న్యూజిలాండ్‌‌‌‌ తరఫున ల్యూక్ ఆల్డ్రెడ్ (29వ, 60వ) రెండు గోల్స్‌‌‌‌ చేశాడు.