టేబుల్ టెన్నిస్లో భారత్కు గోల్డ్ మెడల్

టేబుల్ టెన్నిస్లో భారత్కు గోల్డ్ మెడల్


కామన్వె్ల్త్ గేమ్స్లో  భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు పసిడి పతకాన్ని  గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3-1 స్కోరు తేడాతో సింగపూర్‌ను ఓడించింది.  సింగిల్స్ మ్యాచుల్లో జి సత్యన్, హర్మీత్ దేశాయ్  గెలవడంతో పాటు.. డబుల్స్ మ్యాచ్‌లోనూ విజయం సాధించి గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. తద్వారా భారత్‌ ఖాతాలో ఐదో స్వర్ణం చేరింది.  ఇప్పటి వరకు  భారత్ 11 పతకాలు దక్కించుకుంది. 

ఫస్ట్ మ్యాచ్లో  హర్మీత్ దేశాయ్,- జీ సాథియన్ జోడి 13-11, 1-7, 11-5 తేడాతో యంగ్ ఇజాక్ క్వెక్-యో, ఎన్ కోన్ పంగ్‌ ద్వయంపై విజయం సాధించి భారత ఆధిక్యాన్ని 1-0 పెంచింది. ఆ తర్వాత  శరత్ కమాల్.. క్లెరెన్స్ చ్యూ చేతిలో 7-11, 14-12, 3-11, 9-11 తేడాతో ఓడిపోయాడు. అయితే ఈ సమయంలో  జీ సాథియన్.. కొన్ పంగ్‌పై 12-10, 7-11, 11-7, 11-4 తేడాతో విజయం సాధించి  2-1తో భారత్ కు ఆధిక్యం అందించాడు. చివరి మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్.. జెడ్‌ చ్యూపై 11-8, 11-5,11-6 వరుస సెట్లలో గెలుపొంది భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు.