అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఏపీవాసులు మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఏపీవాసులు మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీవాసులు మృతిచెందారు. ఓరెగాన్ రాష్ట్రంలో ఆగివున్న మరో వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఆరేళ్ల పాపతోసహా ఆమె తల్లి అక్కడికక్కడే మృతిచెందారు..మరో ఇద్దరు తీవ్రంగా గాయాపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు  కక్కెర గీతాంజలి, ఆమె ఆరేళ్ల చిన్నారిగా గుర్తించారు. గాయపడిన ఇద్దరు నరేష్ నాయుడు, అతని కుమారుడుగా గుర్తించారు. ఈ ప్రమాదం మార్చి 30 న జరిగినట్లు తెలుస్తోంది. 

గీతాంజిలి, నరేష్ నాయుడు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లోని కొనకంచి గ్రామానికి చెందినవారు. ఇద్దరు సాఫ్ట్ వేర్లుగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ప్రమాదంలో గీతాంజిలి, ఆమె కుమార్తె ప్రాణాలు కోల్పోయారు.  నరేష్ నాయుడు, కుమారుడు చికిత్స పొందుతున్నట్లు అమెరికన్ పోలీసులు తెలిపారు. 

ALSO READ :- బీజేపీలో చేరుతున్న... పోటీ నుంచి తప్పుకుంటున్న : సుమలత అంబరీష్

సౌత్ మెరిడియన్ రోడ్డులో ఆగివున్న మరో వాహనాన్ని చూడకుండా డ్రైవ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఓరెగాన్ పోలీసులు వెల్లడించారు. కుటుంబం మొత్తం కారులో టెంపుల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.