యోగాలో భారత సంతతి యువకుడికి గోల్డ్ మెడల్

యోగాలో భారత సంతతి యువకుడికి గోల్డ్ మెడల్

భారత సంతతికి చెందిన ఈశ్వర్ శర్మ(13)  అనే యువకుడు స్వీడన్‌ వేదికగా జరిగిన యూరోపియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో యూకేకి ప్రాతినిధ్యం వహించిన ఈ బుడతడు 12-14 విభాగంలో యూరప్ కప్ 2023ని కైవసం చేసుకున్నాడు. అలాగే, ఈశ్వర్ గతంలోనూ ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను సొంతం చేసుకున్నాడు. 

ఈశ్వర్‌కు యోగాపై ఆసక్తి మూడు సంవత్సరాల వయసులోనే మొదలైందట. మొదట తండ్రిని అనుకరిస్తూ, బేసిక్స్ నేర్చుకున్నాడట.  అలా మొదలైన అతని యోగా ప్రస్థానం రోజులు కాలం గడిచేకొద్దీ 14 దేశాలకు పాకింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో 13  ఏళ్ల యువకుడు 14 దేశాలకు చెందిన 40 మంది పిల్లలకు రోజువారీ యోగా తరగతులకు నాయకత్వం వహించాడు. అందుకుగానూ ఈశ్వర్‌ శర్మను అప్పటి బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుతో సత్కరించారు. అలాగే, ఈశ్వర్‌ 2018లో హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో బ్రిటిష్ సిటిజెన్ యూత్ అవార్డు అందుకున్నాడు.