టియర్ ​గ్యాస్ ​కాదు.. స్మోక్ ​కలర్స్

టియర్ ​గ్యాస్ ​కాదు.. స్మోక్ ​కలర్స్

న్యూఢిల్లీ: పార్లమెంట్​లో దుండగులు టియర్​ గ్యాస్​వాడారనే వార్తలు బయటకొచ్చాయి. కానీ వాళ్లు వాడింది కలర్ గ్యాస్​ క్యానిస్టర్స్. చాలా దేశాల్లో వీటి వాడకం చట్టబద్ధమే. ఇవి దాదాపు అన్ని రిటైల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిని సైనికులు, వివిధ క్రీడల్లో, ఫొటోషూట్‌‌లలో ఎక్కువగా వాడతారు. మిలిటరీ, లా ఎన్​ఫోర్స్​మెంట్​ఆపరేషన్లలో సైనికులు వారి కదలికలను శత్రువులకు కనిపించకుండా ఉండేందుకు ఇలాంటి స్మోక్ ​గ్రనేడ్స్​ వాడుతుంటారు.

వైమానిక దాడుల్లో నిర్దేశిత జోన్లను మార్క్​ చేసేందుకు కూడా కలర్​స్మోక్​ను వాడతారు. ఫొటోగ్రఫీలో స్పెషల్​ఎఫెక్ట్​కోసం కూడా కలర్​స్మోక్​ను వినియోగిస్తున్నారు. క్రీడల్లో ముఖ్యంగా ఫుట్‌‌బాల్‌‌ లాంటి ఆటల్లో అభిమానులు తమ క్లబ్‌‌ల రంగులను ప్రదర్శించడానికి స్మోక్​కలర్స్​వాడతారు.