చెస్ ఒలింపియాడ్లో భారత ప్లేయర్ల హవా

చెస్ ఒలింపియాడ్లో భారత ప్లేయర్ల హవా

చెస్ ఒలింపియాడ్లో భారత్ అదరగొడుతోంది.  ఓపెన్‌, ఉమెన్స్ విభాగంలో  భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ఈ  రెండు విభాగాల్లో మూడేసి చొప్పున ఆరు జట్లు ఆడుతున్నాయి. రెండు విభాగాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ద్రోణవల్లి హారిక,  పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, అర్జున్‌ ఎరిగైసి రాణిస్తున్నారు. 

ఉమెన్స్ విభాగంలో..
చెస్ ఒలింపియాడ్ ఉమెన్స్  విభాగంలో భారత టాప్ సీడ్ ( ఇండియా మొదటి టీమ్)  2.5-1.5 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించింది.  తానియా సచ్‌దేవ్ నాలుగో బోర్డులో ఆండ్రియా నవ్రోటెస్కుపై  గెలిచాడు. అటు  కోనేరు హంపీ, ద్రోణవల్లి హారిక, ఆర్.వైశాలి తమ గేమలును డ్రా చేసుకున్నారు.  ఉమెన్స్ రెండో టీమ్ జార్జియా  చేతిలో 1-3 తేడాతో పరాజయం పాలయింది. ఉమెన్స్ మూడో టీమ్ బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌ను 2-2తో సమం చేసుకుంది.

ఓపెన్ విభాగంలో..
ఓపెన్ విభాగంలో అర్జున్ ఎరిగైసి.. మిర్సియా-ఎమిలియన్ పార్లిగ్రాస్‌పై విజయాన్ని నమోదు చేయడంతో..భారత మొదటి టీమ్ రొమేనియాను 2.5-1.5తో ఓడించగలిగింది. మిగతా మూడు గేమ్‌లను పెండ్యాల హరికృష్ణ, విదిత్ గుజరాతీ, S.L నారాయణన్ డ్రా చేసుకున్నారు. అటు భారత్ కు చెందిన రెండో టీమ్..నాలుగో సీడ్ స్పెయిన్‌పై 2.5-1.5 తేడాతో గెలుపొందింది.  అలెక్సీ షిరోవ్‌పై డి.గుకేష్,  ఎడ్వర్డో ఇటూరిజాగా బోనెల్లిపై  బి. అధిబన్  విజయం సాధించారు. R. ప్రగ్నానంద జైమ్ శాంటోస్ లటాసా చేతిలో ఓడిపోయాడు. నిహాల్ సరిన్, డేవిడ్ ఆంటోన్ గుయిజార్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది. భారత్ మూడో టీమ్ 2.5-1.5 తేడాతో చిలీని ఓడించింది. ఫెర్న్ మొరోవిచ్, హ్యూగో లోపెజ్ సిల్వాపై S.P.సేతురామన్, అభిమన్యు పురానిక్‌ గెలుపొందారు.