
న్యూఢిల్లీ: రన్నింగ్ రైళ్లలో మసాజ్ సర్వీస్‌ను ప్రవేశ పెట్టాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. ఇలాంటి సర్వీస్‌ను ప్రవేశపెట్టడం రైల్వే చరిత్రలోనే ఇది మొదటిసారని అధికారులు చెప్పారు. ఇండోర్ నుంచి బయలుదేరే 39 రైళ్లలో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆలోచన వల్ల ప్రయాణికులు పెరుగుతారని, రైల్వేకు ఆదాయం పెరుగుతుందని అధికారులు చెప్పారు. ప్రతి రైలులో ఐదుగురు మసాజ్ చేసేవారు ఉంటారు. వాళ్లకు ఐడెంటీ కార్డులు ఇస్తారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మసాజ్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. మరో 20 రోజుల్లో దీన్ని ప్రారంభించనున్నారు. మసాజ్‌కు రూ.100 చార్జ్ చేస్తామని కమ్యూనికేషన్ డైరెక్టర్ రాజేశ్ చెప్పారు.