
జకర్తా: ఇండియా షూటర్ యోగేశ్ సింగ్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు. ఆదివారం జరిగిన మెన్స్ 25 మీటర్ల ఇండివిడ్యువల్ స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో యోగేశ్ 572 పాయింట్లతో గోల్డ్ నెగ్గాడు. టీమ్ కేటగిరీలో యోగేశ్, అమిత్ (565), ప్రకాశ్ (553)తో కూడిన త్రయం 1690 పాయింట్లతో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఇండియా 32 మెడల్స్ (14 గోల్డ్, 10 సిల్వర్, 8 బ్రాంజ్) సాధించింది. షాట్‌గన్ క్వాలిఫికేషన్‌లో భాగంగా జరిగిన విమెన్స్ ట్రాప్ ఈవెంట్‌లో మూడు రౌండ్లు ముగిసేసరికి శ్రేయాసి సింగ్ (71), భవ్య త్రిపాఠి (68) వరుసగా రెండు, ఆరో ప్లేస్‌లో నిలిచారు.