ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రణయ్‌‌‌‌‌‌‌‌

ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి  ప్రణయ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌. ప్రణయ్‌‌‌‌‌‌‌‌.. ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిదోసీడ్‌‌‌‌‌‌‌‌ ప్రణయ్‌‌‌‌‌‌‌‌ 20–22, 21–14, 21–14తో ఇండియాకే చెందిన ప్రియాన్షు రజావత్‌‌‌‌‌‌‌‌పై గెలిచాడు. గంటా 16 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌‌‌‌‌ తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో ఓడినా తర్వాతి రెండు గేమ్‌‌‌‌‌‌‌‌ల్లో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి అనుభవలేమిని ఆసరాగా తీసుకుని వరుస పాయింట్లతో హోరెత్తించాడు.

దీంతో రెండు గేమ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ ఎక్కడా స్కోరు సమం చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌‌‌‌‌ సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ షెట్టి 21–14, 21–15తో లు చింగ్‌‌‌‌‌‌‌‌ యావో–యాంగ్‌‌‌‌‌‌‌‌ పో హన్‌‌‌‌‌‌‌‌ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు. టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్స్‌‌‌‌‌‌‌‌గా దిగిన కున్లవుట్ విటిద్సర్న్ (థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌) 21–16, 20–22, 21–23తో లీ చెక్‌‌‌‌‌‌‌‌ యు (చైనా) చేతిలో కంగుతిన్నాడు. మూడోసీడ్‌‌‌‌‌‌‌‌ అకానె యమగుచి (జపాన్‌‌‌‌‌‌‌‌) 11–21, 19–21తో బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్ (థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడింది.