అమెరికాలో భారత విద్యార్థికి కత్తిపోట్లు.. పరిస్థితి విషమం

అమెరికాలో భారత విద్యార్థికి కత్తిపోట్లు.. పరిస్థితి విషమం

అమెరికాలో భారతీయ విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడు. భారత్ కుచెందిన విద్యార్థి వరుణ్ (26)పై దుండగుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఓ జిమ్ లో వ్యాయామం చేస్తుండగా జరిగి దుంగగుడి దాడిలో వరుణ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం (అక్టోబర్29) ఉదయం ఇండియానా రాష్ట్రం లోని వాల్ పరైసో నగరంలోని ఓ పబ్లిక్ జిమ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి చేసిన వ్యక్తిని జోర్డాన్  అండ్రాడ్ గా గుర్తించి అరెస్ట్ చేశారు స్థానిక పోలీసులు.