
భారత్ , ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ మ్యాచ్ నేటి నుంచి జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియాకు కెప్టెన్గా బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఎంపికయ్యాడు. కరోనా కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుకు దూరమవడంతో బుమ్రాకు సారథ్య బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. ఇక ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికే టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలవగా..ఈ టెస్టులో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ టెస్టులో గెలిచి సిరీస్ను డ్రా చేసుకోవాలని ఆతిధ్య టీమ్ ప్లాన్స్ వేస్తోంది.
#TeamIndia Playing XI for the 5th Test Match
— BCCI (@BCCI) July 1, 2022
Live - https://t.co/xOyMtKJzWm #ENGvIND pic.twitter.com/SdqMqtz1rg