
దుబాయ్: విమెన్స్ క్రికెట్‌కు సంబంధించిన మూడేళ్ల ఫ్యూచర్ టూర్స్, ప్రోగ్రామ్స్ (ఎఫ్‌టీపీ)ని ఐసీసీ రిలీజ్ చేసింది. మే 2022 నుంచి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో ఇండియా విమెన్స్ టీమ్ 65 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు టెస్ట్‌లు, 27 వన్డేలు, 36 టీ20లు ఉన్నాయి. ఇండియా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో చెరో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.
వన్డేలు, టీ20లు కూడా ఈ రెండు టీమ్స్‌తోనే ఉన్నాయి. ఇప్పటికే అమలవుతున్న ఎఫ్‌టీపీలో ఇండియా ఇప్పటికే 3 వన్డేలు, 3 టీ20లు పూర్తి చేసింది. ఎఫ్‌టీపీ ప్రకారం ఇండియా స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్‌తో తలపడనుంది. ఓవరాల్‌గా అన్ని జట్లకు సంబంధించి 310 మ్యాచ్ (7 టెస్ట్‌లు, 135 వన్డేలు, 159 టీ20లు)లను ఐసీసీ షెడ్యూల్ చేసింది.