బ్రిటన్​లో మనోళ్ల ఆమ్దానీ.. రూ.3.42  లక్షల కోట్లు!

బ్రిటన్​లో మనోళ్ల ఆమ్దానీ.. రూ.3.42  లక్షల కోట్లు!

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. అని అప్పట్లో రాయపోలు సుబ్బారావు దేశం గొప్పతనం గురించి రాశారు. నిజమే మరి, ఇప్పుడు ప్రపంచంలోని ఏ దేశం పోయినా, మనోళ్ల హవా అంతా..ఇంతా కాదు. బ్రిటన్​లో మనోళ్లు పెట్టిన కంపెనీలన్నీ కలిపి ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా..? అక్షరాలా రూ.3.42 లక్షల కోట్లు. 3,684 కోట్ల పౌండ్లు. 1.74 లక్షల మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నారు. ఏటా రూ.9,285 కోట్ల (వంద కోట్ల పౌండ్లు) కార్పొరేట్​ ట్యాక్స్​ కడుతున్నారు. బ్రిటన్​లో మనోళ్ల హవా గురించి తొలిసారి ‘ద ఇండియా ఇన్​ ద యూకే: ద డయాస్పోరా ఎఫెక్ట్​’ పేరిట మంగళవారం ఓ రిపోర్ట్​ విడుదలైంది. లండన్​లోని ఇండియన్​ హైకమిషన్​, ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ చాంబర్స్​ ఆఫ్​ కామర్స్​ అండ్​ ఇండస్ట్రీ (ఫిక్కీ యూకే)తో కలిసి గ్రాంట్​ థోర్న్​టన్​ యూకే అనే సంస్థ స్టడీ చేసి ఈ రిపోర్టును విడుదల చేసింది. బ్రిటన్​లోని కనీసం లక్ష పౌండ్లు (సుమారు రూ.కోటి) టర్నోవర్​ ఉన్న 654 మంది ఇండియన్ల కంపెనీలపై స్టడీ చేసింది. ఆయా కంపెనీలన్నీ కలిసి సుమారు రూ.18,500 కోట్లు (200 కోట్ల పౌండ్లు) పెట్టుబడి పెట్టాయని పేర్కొంది. నిజానికి బ్రిటన్​లో ఇండియన్​ కంపెనీలు 65 వేలకు పైనే ఉన్నా.. కేవలం  ఆ 654 కంపెనీలనే స్టడీకి ఎంచుకుంది థోర్న్​టన్​ సంస్థ.

పెద్ద కంపెనీలవే

ఈ రిపోర్టులో అన్ని కంపెనీలనూ చేర్చలేదని, కేవలం పెద్ద టర్నోవర్​ ఉన్న కంపెనీలను మాత్రమే స్టడీ కోసం తీసుకున్నామని బ్రిటన్​లో ఇండియన్​ హైకమిషనర్​ రుచి ఘనశ్యామ్​ చెప్పారు. గత ఏడాది మార్చి నుంచి ఈ స్టడీ చేశారన్నారు. బ్రిటన్​లో ఇండియన్లకు చెందిన చిన్న కంపెనీలూ తమ వంతు సహకారం అందిస్తున్నాయని, భవిష్యత్తులో ఆ కంపెనీల వివరాలతోనూ రిపోర్ట్​ ఇస్తామని అన్నారు. బ్రిటన్​లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలను గుర్తించి, ఆ దేశం అభివృద్ధిలో ఆయా కంపెనీల భాగస్వామ్యాన్ని తెలుసుకునేందుకు ఈ రిపోర్టు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. 35 శాతం కంపెనీల్లో ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మహిళా డైరెక్టర్లున్నారని రిపోర్ట్​ వెల్లడించింది. 80 శాతం (లక్షా 40 వేలు) ఉద్యోగాలను 23 వ్యాపారాలే సృష్టిస్తున్నాయని తేల్చింది. బీఅండ్​ఎం రిటెయిల్​ లిమిటెడ్​లో ఎక్కువగా 26,496 మంది పనిచేస్తున్నట్టు చెప్పింది. వేదాంత రీసోర్సెస్​ లిమిటెడ్​ (25,083), బోపారాన్​ హోల్డ్​కో లిమిటెడ్​ (21,949), హిందూజా ఆటోమోటివ్​ (19,601), హెచ్​సీ వన్​ లిమిటెడ్​ (10,949) కంపెనీలు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్న కంపెనీల జాబితాలో  టాప్​5లో ఉన్నట్టు చెప్పింది. ఎక్కువగా హాస్పిటాలిటీలో 19% కంపెనీలున్నట్టు రిపోర్ట్​ పేర్కొంది. ఆ తర్వాత హెల్త్​కేర్​లో 15%, రిటెయిల్​ అండ్​ హోల్​ సేల్​ 13%, రియల్​ ఎస్టేట్​ 13%, ఫుడ్​ అండ్​ బెవరేజెస్​లో 9% కంపెనీలున్నట్టు పేర్కొంది. 52% కంపెనీలు ఒక్క లండన్​లోనే ఉన్నాయట.

మొత్తం ఇండియన్ల వాటా 7.87 లక్షల కోట్లు

బ్రిటన్​ ఎకానమీకి మొత్తం ఇండియన్ల కాంట్రిబ్యూషన్​ సుమారు రూ.7.87 లక్షల కోట్లు (8,500 కోట్ల పౌండ్లు) అని రిపోర్ట్​ అంచనా వేసింది. సుమారు రూ.15,737 కోట్లు (170 కోట్ల పౌండ్లు) కార్పొరేట్​ ట్యాక్స్​ కడుతున్నారని చెప్పింది. మొత్తంగా 2.8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారంది. ఇప్పటిదాకా బ్రిటన్​ ఎకానమీలో ఇండియన్​ కంపెనీల వాటాపై చేసిన మొదటి స్టడీ ఇదేనని చెబుతున్నారు.