వంటింటికి దూరమౌతున్న ఇండియా: నెలలో 15 రోజులు ప్యాకేజీ ఫుడే

వంటింటికి దూరమౌతున్న ఇండియా: నెలలో 15 రోజులు ప్యాకేజీ ఫుడే

నిత్యవసర వస్తువుల ధరలు రానురాను పెరిగిపోతున్నాయి అనుకుంటూనే.. మనం వాటిపైనే అధికంగా ఖర్చు చేస్తున్నాం. డేటా అండ్ ప్రోగ్రామ్స్ మంత్రిత్వ శాఖ(మోస్పీ), ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వారు సంయుక్తంగా ఓ సర్వే చేశారు. ఆ సర్వేలో ఇండియాలో ఫ్యాకేజీ ఫుడ్ ఐటమ్స్ పై జనాలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని తేలింది. భారతీయులు ఒక నెలలో ఆహారంపై పెట్టే ఖర్చులో 50శాతం ప్యాకేజీ ఫుడ్ పైనే ఖర్చు చేస్తున్నారని ఈ సర్వే చెప్తుంది. గడిచిన పది సంవత్సరాల ఆధారంగా ఈ విషయాన్ని చెప్పారు. 10 సంవత్సరాల క్రితంతో పోల్చితే సహజ సిద్దంగా లభించే ఆహార పదార్ధాలు కాకుండా ప్యాకేజీ ఫుడ్‌పై 41.2శాతం ఖర్చు పెరిగిందట. ఈ లెక్కన చూస్తూ భారతీయులు నెలలో 15 రోజులు ఫ్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలే తింటున్నారు.

డ్రై ఫ్రూట్స్‌పై చేసే ఖర్చు ఒక దశాబ్దం క్రితం పట్టణ ప్రాంతంలో 0.8 శాతం నుండి 1.3 శాతానికి, గ్రామీణ కుటుంబాల్లో 0.6 శాతం నుండి 1.2 శాతానికి పెరిగింది.. ఇది ఆదాయాలు పెరగిందని చెప్పే సంకేతం. తృణధాన్యాలు, గుడ్లు, చేపలు, మాంసం మరియు ఎడిబుల్ ఆయిల్ ఫ్లాట్‌గా ఉండగా.. పట్టణ, గ్రామీణ ప్రజల ఇన్‌కమ్ (ఆదాయం) పెరగడంతో ప్రాసెస్ చేయబడిన ఫుడ్, డ్రింక్స్ పై చేసే ఖర్చు పెరిగిందని మోస్పి డేటాలో పేర్కొంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫుడ్ బడ్జెట్‌లో ప్రాసెస్ చేయబడిన ఆహారం, పానీయాలపై చేసే ఖర్చు 16 శాతం నుండి దాదాపు 25 శాతానికి పెరిగింది. మధ్యతరగతి కుటుంబాల ఖర్చు చేసే శక్తి పెరగడంతో డిమాండ్ పెరుగుతుంది. అలాగే, ఎక్కువ మంది పని చేసే జంటలు డిమాండ్‌ను పెంచుతున్నారు. లో షుగర్ లెవల్స్ ఉన్న పదార్థాలు, ఆర్గానిక్ ఫుడ్, ఇంస్టాంట్ డ్రింక్స్ వంటి ప్రాడక్ట్స్ తయారు చేసే కంపెనీలపై పెట్టుబడులు అధిక-ఆదాయ వర్గాలను ఇంట్రాక్ట్ చేశాయి.