అపరిశుభ్ర అలవాట్లతో కరోనా వ్యాప్తి తగ్గిందంటున్న సైంటిస్టులు

అపరిశుభ్ర అలవాట్లతో కరోనా వ్యాప్తి తగ్గిందంటున్న సైంటిస్టులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గత నెలతో పోలిస్తే కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. దీనికి కారణం ఏంటో తెలిస్తే కాస్త ఆశ్చర్యపోవాల్సిందే. ఇండియాలో కరోనా ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ప్రజల అపరిశుభ్ర అలవాట్లే కారణమని కొత్తగా ఓ పరిశోధనలో వెల్లడైంది. అన్‌‌హైజీనిక్ అలవాట్ల వల్ల దేశ ప్రజల్లో కరోనాను తట్టుకునే సామర్థ్యం, హర్డ్ ఇమ్యూనిటీ పెరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే కరోనాను ఎదుర్కొనేందుకు అపరిశుభ్రమైన అలవాట్లను అనుసరించడం మాత్రం మార్గం కాదని సైంటిస్టులు స్పష్టం చేశారు.