హిమాలయాల్లో యతి ‘అడుగు’ జాడలు

హిమాలయాల్లో యతి ‘అడుగు’ జాడలు
  • ఏప్రిల్ 9న మకాలూ బేస్ లో చూశామన్న ఆర్మీ
  • 32/15 అంగుళాల పాదాలు.. ట్విట్టర్ లో ఫొటోలు
  • నెటిజన్ల భిన్న స్వరాలు.. ఆర్మీ తీరు బాలేదని వ్యాఖ్యలు

యతి ఉందా? కొన్ని శతాబ్దా లుగా దీనిపై ఎడతెగని చర్చే జరుగుతోంది. ఉందని కొందరు..లేదని మరికొందరు.. వట్టి భ్రమ అని ఇంకొందరు..అదో జంతువని సైంటిస్టులు చెబుతుంటారు. తాజాగామళ్లీ ఆ యతిపైనే చర్చ మొదలైంది. హిమాలయాల్లో యతి అడుగు జాడలను గుర్తించామని ఇండియన్ ఆర్మీ ప్రకటిం చింది. యతి అడుగుల ఫొటోలనూ ట్వీట్ చేసింది. నేపాల్ లోని మకాలూ బేస్ క్యాంప్ లో యతి అడుగులను తమ పర్వతారోహణ బృందం గుర్తించిందని పేర్కొంది. ఒక్కో అడుగు మూడడగుల పొడవు, అడుగున్నర వెడల్పు ఉన్నట్టు తెలిపింది. ‘‘తొలిసారి ఆర్మీ మౌంటెనీరిం గ్ ఎక్స్ పెడిషన్ టీం యతి అడుగులను గుర్తించింది. దాని పాదాలు 32/15 అంగుళాలున్నాయి. ఏప్రిల్ 9న మకాలూ బేస్ క్యాంప్ లో ఆ అడుగులు కనిపించాయి. గతంలో మకాలూ బరూన్ నేషనల్ పార్క్​లో మాత్రమే యతి కనిపించింది” అని ట్వీట్ చేసింది.

యతి అడుగులను ఫొటో తీశామని,అదో కాదో తేల్చేందుకు సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ కోసం నిపుణుల దగ్గరకు పంపామని ఆర్మీ తెలిపింది.దాదాపు పది రోజుల పాటు ఆ ఫొటోలను పరిశీలించాకే అది యతి అన్న నిర్ధారణకు వచ్చామని సైన్యం తెలిపింది. అయితే, జనం మాత్రం ఆర్మీ ప్రకటనపై రెండు వర్గాలుగా విడిపోయారు. గుడ్ అని కొందరు అంటుం టే.. ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేసి ఆర్మీపేరును దిగజారుస్తున్నారని మరి కొందరు విమర్శిస్తున్నారు. ఆర్మీ ఇలాంటి వాటిని జనాల్లోకి తీసుకెళ్లడం అసంతృప్తికి గురిచేసిందని విమర్శిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఇలాంటి జోకులను వేయకుండా ఉంటే బాగుంటుందని మండిపడుతున్నారు. యతిఉందని నమ్మే వారు మాత్రం ఆర్మీ చెప్పిం ది నిజం అని అంటున్నారు.

ఏంటీ యతి?

హిమాలయాల్లో తిరుగుతున్న పురాతన జీవి యతి అని అంటూ ఉంటారు. పెద్ద కోతిలా ఉంటుం దని, మనిషి కన్నా భారీ ఆకారం ఉంటుందని చెబుతూ ఉంటారు.అంతేకాదు.. ఎలుగ్గొడ్డులా ఉంటుందని మరికొం దరివాదన. మెతె అనీ దాన్ని పిలుస్తుంటారు. పురాణాల్లో-నూ యతి ప్రస్తావన ఉంటుం ది. 1921లో ఆజాను-బాహు మంచుమనిషి (అబామినబుల్‌‌‌‌ స్నోమాన్‌‌‌‌)అని పేరు పెట్టారు. బ్రిటన్ లెఫ్టినెంట్ కల్నల్ చార్లెస్ హోవార్డ్​ రాసిన బుక్కులో  21 వేల అడుగుల ఎత్తున లక్పాలా వద్ద అడుగులు చూసినట్టు పేర్కొన్నారు.

యతి నిజం

2007లో అమెరికా టీవీ ప్రెజెంటర్ యతి అడుగులను గుర్తించి నట్టు చెప్పారు. దానిపై వరుస కథనాలూ వేశారు. 2008 జూలై 25న ఈశాన్యభారతలోని గారో హిల్స్ లో  దొరికిన వెంట్రుకలను ఆక్స్ ఫర్డ్​ బ్రూక్స్ యూనివర్సిటీ పరిశోధకులు పరీక్షించారు. దానిపై బీబీసీ కథనం రాసింది. 2011 లో రష్యాలో పెట్టిన ఓ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సైంటిస్టులు, చరిత్రకారులు యతి ఉంది అనేందుకు 95 శాతం కచ్చితమైన ఆధారాలున్నాయని చెప్పారు. తర్వాత ఆ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగిం ది. 2013లో ఆక్స్ ఫర్డ్​, లౌసానే యూనివర్సిటీ పరిశోధకులు  ఆ జీవి డీఎన్ఏని పరీక్షించారు. ఇండియాలోని లద్ధాఖ్ , భూటాన్ లో ఓ గుర్తు తెలియని జంతువు వెంట్రుకలు సేకరించిన సైంటిస్టులు పోల్చి చూశారు. ఎలుగును చూసి అందరూ యతి అనుకుంటున్నారని తేల్చా రు.2017లోనూ దొరికిన శాంపిళ్లపై పరిశోధన చేసిన సైంటిస్టులు.. ఎలుగులనే తేల్చా రు.

సినిమాలు.. బుక్కులు.. కార్టూన్లు

యతి ఉందా లేదా అన్నది పక్కనపెడితే ఎన్నోసిని మాలు, కార్టూన్లు , పుస్తకాలు, వీడియోగేమ్స్   యతి ప్రస్తావన వచ్చింది. మిస్టర్ నట్జ్​ అనే వీడియోగేమ్ లో మిస్టర్ బ్లిజర్డ్​ అనే యతి కేరెక్టర్ ఉంటుం ది. 2006 టైటాన్ క్వెస్ట్​ వీడియోగేమ్ లో  యతిని క్రూరమృగంగా చూపించారు. వాల్ట్​ డిస్నీ వరల్డ్స్​ ఎక్స్ పెడిషన్ ఎవరెస్ట్​లో 25 అడుగులఎత్తైన యతి కేరెక్టర్ ఉంటుం ది. 1964లో వచ్చి నరుడాల్ఫ్ ద రెడ్ నోస్డ్​ రెయిన్ డీర్ అనే క్రిస్మస్ స్పెషల్ షో లో బంబుల్ అనే యతి ఉంటుం ది. స్నో మాన్ స్టర్ గా చిత్రీకరిం చారు. మాన్ స్టర్స్ , ఐఎన్ సీ అనే సినిమా చివర్లోనూ యతి కనిపిస్తుంది. యతిపై బెంగాల్ లో యతి ఒభిజాన్ అనే సినిమా తీశారు.దాని పన్ను చుట్టూ కథ తిరుగుతుంది. 2016లో ఓ ట్రావెల్ చానెల్ ఎక్స్ పెడిషన్ అన్ నోన్ అనే సిరీస్ లోహంట్ ఫర్ యతి అనే కథనాన్ని నాలుగు ఎపిసోడ్లలో తీసింది. టిన్ టిన్ ఇన్ టిబెట్ అనే కార్టూన్ ఫిల్మ్​లోనూ యతిని చూపిస్తారు.

వేట దేవుడిగా పూజలు

టిబెట్‌‌‌‌లోని బౌద్ద మతస్థులు యతిని పూజించేవారట. దేవుడిగా నమ్మేవారట. వేట దేవుడిగా యతిని లెప్చా ప్రజలు పూజించేవారని హె సైజర్ అనే చరిత్రకారుడు చెప్పా రు. ఒకానొకప్పుడు బోన్ మతస్తులు యతి రక్తంతో పూజలు చేసేవారట. 1832లోఎవరెస్ట్​ అధిరోహణకు వెళ్లిన ట్రెక్కర్ బీహెచ్ హోడ్గ్సన్ ప్రకారం.. పొడవాటి నల్లటి జుట్టు కలిగిన ఓ పెద్దజంతువు వారికి కనిపించిందట. దాన్ని ఒరంగుటన్ (గొరిల్లా జాతికి చెందిన కోతి)గా తేల్చారాయన.1899లోనూ  పర్వతారోహకులు  దాని అడుగులను గుర్తించారు. 20వ శతాబ్దం వచ్చేటప్పటికి దానిపై కథనాలు మరింత పెరిగాయి. జెమూ గ్లేసి యర్ లో ఓ పెద్ద జంతువును చూసినట్టు 1925లో రాయల్ జియోగ్రాఫికల్  సొసైటీ సభ్యుడు ఎన్ ఏ తొంబాజీ చెప్పారు. జస్ట్​ 200 నుంచి 300 గజాల దూరం నుంచే దాన్ని ఓ నిమిషం పాటు చూశానని చెప్పుకొచ్చారు.

1950లో యతి వేటకు నేపాల్ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిం ది. 1951లో ఎవరెస్ట్​ శిఖరం ఎక్కుతున్న ఎరిక్ షిప్టన్ అనే వ్యక్తి పెద్ద పెద్ద అడుగులనుగుర్తించాడు. ఉత్తర సిక్కింలో జెమూ గ్లేసి యర్ వద్ద యతి అడుగులను చూసినట్టు 1948లో పీటర్ బైర్న్​ అనే పర్వతారోహకుడు చెప్పాడు. 1954 మార్చి 19న అంతర్జాతీయ వార్తా సంస్థలు యతిపై పెద్ద కథనాలను రాశాయి. 1957లో అమెరికాకు చెందిన టామ్ స్లిక్ అనే వ్యక్తి యతిపై పరిశోధనలు మొదలుపెట్టాడు. 1959లో దాని మలాన్ని సేకరించినట్టు చెప్పాడు. ఆ మలంలో ఇప్పటి వరకూ చూడని ఓ సూక్ష్మజీవిని గుర్తించినట్టు చెప్పాడు.1960లో సర్ ఎడ్మం డ్ హిల్లరీ అనే సైంటి స్ట్​ ఖుంజంగ్ లోని మొనాస్టరీలో దాచిన యతి వెంట్రుకలను సేకరించి సైంటిఫిక్ పరిశోధనలు చేశారు.ఎలుగ్గొడ్డు వెం ట్రుకలని తేల్చా రు. 1966లో భూటాన్ యతికి గౌరవ సూచకంగా స్టాం పులనూ ముద్రించింది.