పోటీ అంటే ఇదీ : ఇస్రో చంద్రయాన్ కు పోటీగా.. రష్యా లూనా 25

పోటీ అంటే ఇదీ : ఇస్రో చంద్రయాన్ కు పోటీగా.. రష్యా లూనా 25

చంద్రుడిపై అధ్యయనానికి (Moon Study) పంపిన చంద్రయాన్-3  చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్లి కక్ష్యను మరింత తగ్గించిందని ఇస్రో వెల్లడించింది. ఇది ఆగస్టు 14న మరో మైలురాయిని చేరుకోనుందని తెలిపింది.  అయితే రేపు(ఆగస్టు 11న) రష్యా దీనికి పోటీగా చంద్రమిషన్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. 45 ఏళ తర్వాత ఆ దేశం చేస్తున్న తొలి ప్రయత్నం ఇది.  
రష్యా కు చెందిన లూనా25 మాస్కో తూర్పున 3,450  మైళ్ల దూరంలో ఉన్న వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్నుండి నుంచి ప్రయోగించబడుతుందని రష్యా స్పేస్ వర్గాలు తెలిపాయి. ఇది చంద్రునిపైకి వెళ్లడానికి ఐదు రోజులు పడుతుందని తెలిపారు. రాయిటర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది చంద్రుని కక్ష్యలో ఏడు రోజులపాటు తిరుగుతుంది.  అయితే చంద్రయాన్ 3 ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై దిగేందుకు సిద్ధంగా ఉంది. ఇది రష్యా అంతరిక్ష నౌక ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

రెండు అంతరిక్ష నౌకలు ఒకదానికొకటి సమస్యగా మారతాయా?
రెండు వేర్వేరు ప్రాంతాల్లో ల్యాండింగ్ అవుతున్నందున రెండు అంతరిక్ష నౌకలు ఒకదానికొకటి అడ్డు పడవని  రోస్కో స్మోస్ స్పష్టం చేశారు.  రాయిటర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం లేదని.. చంద్రునిపై ఇవి వేర్వేరు ప్రాంతాల్లో ల్యాండ్ అవుతాయని తెలుస్తోంది. చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రెండు మిషన్లు వేర్వేరు లక్ష్యాలను, టైమింగ్ లను కలిగివున్నాయి. 
చంద్రయాన్ 3 చంద్రునిపై 14 రోజులు గడుపుతుంది. అయితే మానవ జీవితానికి తోడ్పడే చంద్రుని ఉపరితలం కింద 6 అంగుళాల దిగువన మంచు నీటి ఉనికిని కనుగొనడానికి లూనా 25 సంవత్సర కాలం పాటు పరిశోధనలు కొనసాగిస్తుందని రోస్కో స్మోస్ తెలిపింది.  రష్యా చంద్రమిషన్ ముందుగా 2021 అక్టోబర్ లో ప్రయోగించాలని అనుకున్నప్పటికీ రెండేళ్లు ఆలస్యం అయింది.