కలిసికట్టుగా కరోనాను తరిమేద్దాం

కలిసికట్టుగా కరోనాను తరిమేద్దాం

ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని క‌రోనా వైర‌స్‌ను క‌లిసిక‌ట్టుగా త‌రిమేద్దామ‌ని పిలుపునిచ్చారు. క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌జ‌ల్లో భాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించేందుకు కేంద్రం జ‌న్ ఆందోళ‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా మోడీ ట్వీట్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యాల‌ను గుర్తుంచుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించి.. భౌతిక దూరాన్ని పాటించాల‌న్నారు. నిత్యం చేతులు శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు. ఇద్ద‌రి మ‌ధ్య‌ కనీసం రెండు గ‌జాల దూరం ఉండేలా ప్రాక్టీస్ చేయాలన్నారు. ఈ నియ‌మాలు పాటించి క‌రోనాపై విజ‌యం సాదిద్ధామన్నారు మోడీ.