పాజిటివ్‌ న్యూస్‌: మన దేశంలో తగ్గుతున్న కరోనా మరణాల రేటు

పాజిటివ్‌ న్యూస్‌: మన దేశంలో తగ్గుతున్న కరోనా మరణాల రేటు
  • ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మరణాల రేటు రోజు రోజుకి తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల రేటు తక్కువ అని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ ఆదివారం చెప్పింది. ప్రస్తుతం ఆ రేటు 2.49 శాతం ఉందని చెప్పింది. 29 రాష్ట్రాలు, యూనియన్‌ టెరిటరీస్‌లో ఫాటిలిటీ రేట్‌ (సీఎఫ్‌ఆర్‌‌) ఇండియా యావరేజ్‌ కంటే తక్కువగా నమోదవుతుందని అన్నారు. దాదాపు ఐదు రాష్టాల్లో సీఎఫ్‌ఆర్‌‌ జీరో అని, 14 రాష్ట్రాల్లో 1 శాతం కంటే తక్కువగా ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉత్తమమైన క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటల్స్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం వల్ల మరణాల రేటు తక్కువగా నమోదవుతుందని మినిస్ట్రీ చెప్పింది. కంటైన్మెంట్‌ స్ట్రాటజీ, టెస్టింగ్‌, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొటోకాల్‌ పాటించడం కూడా చాలా తోడ్పడిందని అధికారులు చెప్పారు. మొదట్లో 2.82 శాతంగా ఉన్న మరణాల రేట్‌ జులై 10 నాటికి 2.72కి చేరిందని, ప్రస్తుతం ఆ రేటు 2.49గా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గైడెన్స్‌లో రాష్ట్రాలు, యూనియన్‌ టెరిటరీలు టెస్టులు పెంచి సరైన జాగ్రత్తలు తీసుకున్నాయని హెల్త్‌ మినిస్ట్రీ చెప్పింది. టెక్నాలజీ కూడా చాలా బాగా ఉపయోగపడిందని చెప్పారు. “ గ్రౌండ్‌ లెవల్‌లో ఫ్రంట్‌ లైన్‌ హెల్త్‌ వర్కర్లు, ఏఎన్‌ఎమ్‌లు చాలా కృషి చేశారు. మైగ్రెంట్స్‌ని గుర్తించి వారికి టెస్టులు చేసి జాగ్రత్తలు తీసుకోవడంలో కృషి చేశారు” అని చెప్పింది. మణిపూర్‌‌, నాగాలాండ్‌, సిక్కిం, మిజోరాం, అండమాన్‌ అండ్‌నికోబార్‌‌ ఐలాండ్‌లో జీరో కేస్‌ ఫాటలిటీ రేట్‌ ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు 26,816 మంది కరోనా బారినపడి చనిపోయారు.