చౌకవే.. పేదోళ్లకు ఎంతో మేలు

చౌకవే.. పేదోళ్లకు ఎంతో మేలు
  • కొత్త డివైజ్ లు కనిపెట్టిన మన డాక్టర్లు
  • పేదోళ్లకు ఎంతో మేలు

డాక్టర్ అనగానే పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఇవ్వడం. అవసరమైతే ఓవర్ టైమ్ ఉండటం. గంటల కొద్దీ ఆపరేషన్లు చేయడం.ఇంతేకాదు ఇంకా చాలా ఉన్నాయంటున్నారు యువ డాక్టర్లు. స్టెతస్కోప్, హార్ట్ మానిటర్, పేస్మేకర్ రోగుల జీవితాన్ని ఎంత ఈజీ చేశాయో చెప్పనక్కర్లే దు. వీటి కంటే తక్కు వ ధరకే గ్యాడ్జెట్ లు తయారు చేస్తూ పేద రోగులను మన డాక్టర్లు ఆదుకుంటున్నారు .

ఆమ్ వాయిస్ ప్రొస్థసిస్

బంగ్లాదేశ్ కు చెందిన ఓ పేషెంట్ కు కేన్సర్. ట్రీట్మెంట్ లో భాగంగా లారింక్స్ తొలగించారు. దీంతో మాట పోయింది. ఓ ఆర్టిఫిషియల్ వాయిస్ బాక్స్ ను అతని గొంతులో అమర్చారు. కొద్ది రోజులకు బాక్స్ పగిలిపోయింది. మళ్లీ వేయించుకుందామంటే ఖర్చు భారం భరించలేక ఊరుకున్నాడు. ఇప్పటికి ఎనిమిదేళ్లు గడిచాయి. జీవితాంతం ఇక మాట ఉండదు అనుకుంటున్న టైంలో బెంగళూరులోని డా.విశాల్ రావుని కలిశాడు. అతని సమస్యను తెలుసుకున్న విశాల్ తాను తయారు చేసిన ఆమ్ వాయిస్ ప్రొస్థసిస్ ను ఇచ్చారు . దీని విలువ కేవలం 50 రూపాయలు. అతని గొంతులో పెట్టి టెస్టు చేయగా అద్భు తమైన ఫలితాలు వచ్చాయి. ‘షేక్ హసీనా మళ్లీ ప్రధాని అయ్యారు . ప్రతిపక్షానికి కేవలం మూడే సీట్లు వచ్చాయి’ అని తన తొలి మాటను చెప్పాడతను. మామూలు మార్కె ట్ లో వాయిస్ బాక్స్ ఖరీదు రూ.20 నుంచి రూ.30 వేల వరకూ పలుకుతోం ది.

డిజిటల్ కెమెరాతో ఎండోస్కోపి!

అది 2009. డా. జగదీశ్ చతుర్వేది బెంగళూరులోని  సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజిలో చదువుకుంటున్న రోజులు. అక్కడి రూరల్ హెల్త్ సెంటర్లలో ఎండోస్కోపి ఫలితాలను చూడటానికి పెద్ద మానిటర్లు లేవు. ఇది కాబోయే డాక్టర్లకు పెద్ద తలనొప్పి అనిపించే ది. ట్రీట్ మెంట్ కు  వచ్చిన వాళ్లకు ఉన్న సమస్యను కచ్చితంగా అంచనా వేయడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. పెద్ద అద్దాలు, హెడ్ ల్యాంప్స్ సాయంతో అంతోఇంతో జబ్బును గుర్తించగలిగేవారు. ఇదే విషయాన్ని జగదీశ్ సీనియర్ డాక్టర్ రవి నాయర్ కు చెప్పారు . దానికి ఆయన ‘నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. మాటల కంటే చేతలతో చూపించు’అని చెప్పారు .

దాన్నో సవాలుగా స్వీకరించి రూ. 10 వేలు పెట్టి ఓ డిజిటల్ కెమె రా కొన్నారు జగదీశ్. దానికి ఎండోస్కోపి పరికరాన్ని ఇంజనీర్ సాయంతో బిగించారు. సొంతంగా ఓ పొర్టబుల్ రికార్డింగ్ డివైజ్ ను తయారు చేశారు. దాన్ని కెమెరాకు సెట్ చేశారు. అలా ఎండోస్కోపీ డివైజ్ రోగి నోట్లోకి పంపి కెమె రా స్క్రీన్ పై గొంతును క్లియర్గా చూశారు. ఇలా వందల మంది పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేశారు. 2013లో కమర్షియల్ గా కూడా ఈ డివైజ్ ను లాంచ్ చేశారు. అయితే ఇంకా పేటెంట్ రావాల్సి వుంది. ఇదొక్కటే కాదు పేదలకు పనికొచ్చే 18 కొత్త డివైజ్ లను జగదీశ్ కనిపెట్టా రు. చిన్నపిల్లలు ముక్కు లో పెట్టుకునే బలపాలు, రబ్బర్లను బయటకు తీసే పరికరం కూడా వీటిలో ఒకటి. మామూలు వాళ్లు కూడా దీన్ని వాడొచ్చు.