విమెన్స్‌‌‌‌ టీ20 ఆసియా కప్‌లో.. పాక్​తో ఇండియా తొలి పోరు

విమెన్స్‌‌‌‌ టీ20 ఆసియా కప్‌లో.. పాక్​తో ఇండియా తొలి పోరు

న్యూఢిల్లీ : విమెన్స్‌‌‌‌ టీ20 ఆసియా కప్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ మంగళవారం విడుదలైంది.  డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ఇండియా.. జులై 19న పాకిస్తాన్‌‌‌‌తో జరిగే తొలి మ్యాచ్‌‌‌‌తో టోర్నీని మొదలుపెట్టనుంది. జులై 28 వరకు శ్రీలంకలోని దంబుల్లాలో జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి.  

ఈసారి జట్లను రెండు గ్రూప్‌‌‌‌లుగా విభజించారు. గ్రూప్‌‌‌‌–ఎలో ఇండియా, పాకిస్తాన్‌‌‌‌, యూఏఈ, నేపాల్.. గ్రూప్‌‌‌‌–బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌‌‌‌, థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌, మలేసియా ఉన్నాయి. ప్రతి గ్రూప్‌‌‌‌లో టాప్‌‌‌‌–2లో నిలిచిన జట్లు సెమీస్‌‌‌‌ చేరుతాయి.