బ్లూ టిక్ కోసం చెల్లింపులపై స్పందించిన ట్విట్టర్ తొలి యూజర్

బ్లూ టిక్ కోసం చెల్లింపులపై స్పందించిన ట్విట్టర్ తొలి యూజర్

ట్విట్టర్ లో మార్పులకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. రోజుకు ఇన్ని వార్తలు చదువుతున్నాం కదా.. ఇంతకీ తొలి ట్విట్టర్ యూజర్ ఎవరా అని ఎప్పుడైనా ఆలోచించారా.  దాదాపు 16 ఏళ్ల కిందట దేశంలోనే ట్విట్టర్ మొదటి యూజర్ నైనా రద్దు. ప్రస్తుతం రాజస్థాన్ జై సల్మేర్ లోని ఓ హోటల్ లో పని చేస్తోంది. అయితే ఆర్కుట్, బ్లాగింగ్ ఉన్న కాలంలో ట్విట్టర్ అధికారికంగా ఎవరికీ తెలియదు. 2006లో ఇప్పుడున్న TWITTER , ప్రారంభంలో TWTTR పేరిట ఉండేదట. ఆ పేరుతో నైనా మొదటిసారిగా మెయిల్ వచ్చిందట. ఏదో ఇన్విటేషన్ అనుకొని అందులో చేరిన ఆమె.. భారత్ తరపున తొలి ట్విట్టర్ యూజర్ గా పేరు పొందారు.

అయితే ఇటీవలే ట్విట్టర్ డీల్ పూర్తి చేసిన ఎలాన్ మస్క్.. రీసెంట్ గా తీసుకొచ్చిన మార్పులపై నైనా స్పందించింది. ట్విట్టర్ లో బ్లూ టిక్ కోసం నెలకు రూ.650 (8 డాలర్లు) దాకా చెల్లించాలని అంటున్నారు.. అసలు ఎందుకు చెల్లించాలన్న దానిపై స్పష్టత లేదు కదా. ఇప్పుడున్న బ్లూటిక్‌ అకౌంట్ల విషయంలోనా? కొత్తగా రాబోతున్న అకౌంట్ల విషయంలోనా? లేదంటే ఇంకా ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? అలా అయితే నేను కూడా ఆ 8 డాలర్లు చెల్లించేవాళ్లలో ఉంటానా అని నైనా ప్రశ్నించింది. కానీ ఇది ప్రతి ఒక్కరికీ అంటే సహేతుకం కాదని వారించింది. తానెప్పుడూ బ్లూ టిక్ కోసం చెల్లింపులు చేయలేదని, దాని వల్ల పెద్ద మార్పులేం ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. కచ్చితంగా కావాలని అనుకునేవాళ్లు డబ్బు చెల్లిస్తారు. అవసరం లేదనుకునే వాళ్లు మానుకుంటారని చెప్పింది. అయితే ఇండిపెండెంట్‌ జర్నలిజం లాంటి పనులు చేసుకునేవాళ్లకు మాత్రం ఇది ప్రభావం చూపించొచ్చు అని నైనా తెలిపింది. 

తాను ట్విట్టర్ లో జాయిన్ అయినపుడు ఇది ఈ రోజు ఇంత పెద్ద మహా వృక్షంగా అవుతుందని అనుకోలేదని నైనా చెప్పింది. అప్పట్లో ట్విట్టర్ ఉద్యోగులు, వాళ్ల స్నేహితులు మాత్రమే చాటింగ్ లో పాల్గొనేవాళ్లని... కానీ తాను ముంబయిలో ఉద్యోగం కోసం వచ్చాక తానూ మెసేజులు చేయాలని భావించినట్టు తెలిపింది. అయితే ట్విట్టర్ ను తాను కేవలం మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ అనుకొని.. ఏడాది వరకు అలానే ఉండిపోయానని తెలిపింది.  అమెరికాలో ఓ ఆర్టికల్‌లో తొలి 140 మంది ట్విటర్‌ యూజర్ల మీద ఓ కథనం ప్రచురితమైంది. అందులో తన పేరు చూసుకున్నాకే అర్థమైందని, ఇదేదో ప్రత్యేకమైన ఫ్లాట్‌ఫామ్‌ అని...  ఆ తర్వాత తక్కువ యూజర్లు ఉన్నప్పటికీ తొలి యూజర్‌కావడంతో ట్విటర్‌ నుంచి ఆమెకు బ్లూటిక్‌ మార్క్‌ దక్కింది. అంతే కాదు ఆమె ఇప్పటివరకూ లక్షా 75వేల ట్వీట్లు చేయడం గమనార్హం.