హెచ్2లో.. కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు 36 శాతం

హెచ్2లో.. కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు 36 శాతం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (హెచ్​2) పూర్తి సంవత్సర లక్ష్యంలో 36.5 శాతంగా నమోదైంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)  ప్రకారం, ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఉన్న 29 శాతం కంటే ఎక్కువ. ప్రభుత్వ ఖర్చు,  ఆదాయం మధ్య తేడా అయిన ద్రవ్య లోటు, 2025–26 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ. 5,73,123 కోట్లుగా ఉంది. 

కేంద్రం 2025–-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతం లేదా రూ. 15.69 లక్షల కోట్లుగా అంచనా వేసింది.  ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ప్రభుత్వానికి రూ. 16.95 లక్షల కోట్లు  వచ్చాయి. ఇందులో కేంద్రానికి నికర పన్ను రాబడి రూ. 12.29 లక్షల కోట్లు, పన్నేతర రాబడి రూ. 4.6 లక్షల కోట్లు,  రుణేతర మూలధన రసీదులు రూ. 34,770 కోట్లు ఉన్నాయని సీజీఏ తెలిపింది.