ముంబై: భారత్ ఫారెక్స్ నిల్వలు అక్టోబర్ 24తో ముగిసిన వారంలో 6.925 బిలియన్ డాలర్లు తగ్గి 695.355 బిలియన్ డాలర్లకి చేరాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అంతకుముందు వారంలో ఇవి 4.496 బిలియన్ డాలర్లు పెరిగి 702.28 బిలియన్ డాలర్లకి చేరాయి. అక్టోబర్24తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 3.862 బిలియన్ డాలర్లు తగ్గి 566.548 బిలియన్ డాలర్లకి చేరాయి.
డాలర్ పరంగా లెక్కించినా, ఈ ఆస్తుల్లో యూరో, పౌండ్, యెన్ వంటి నాన్ యూఎస్ కరెన్సీలు కూడా ఉన్నాయి. బంగారం నిల్వలు కూడా 3.01 బిలియన్ డాలర్లు పడి 105.536 బిలియన్ డాలర్లకి తగ్గాయి. బంగారం ధరలు తగ్గడంతో బంగారం నిల్వల విలువ తగ్గింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 58 మిలియన్ డాలర్లు తగ్గి 18.664 బిలియన్ డాలర్లకి తగ్గాయని, ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్ (ఐఎంఎఫ్)లో భారత్ రిజర్వ్ స్థానం 6 మిలియన్ డాలర్లు పెరిగి 4.608 బిలియన్ డాలర్లకి చేరిందని ఆర్‌బీఐ తెలిపింది.
