న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతం ఉండొచ్చని వరల్డ్ బ్యాంక్ మంగళవారం అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇచ్చిన 6.6 శాతం అంచనాతో పోలిస్తే ఇది 0.5 శాతం ఎక్కువ కావడం విశేషం. మొదటి క్వార్టర్‌లో మన ఎకానమీ రాణించడమే ఈ పెంపునకు ప్రధాన కారణం. వాణిజ్య వ్యాపారాలు, భౌగోళిక రాజకీయంలో అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడిందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.
