కామన్వెల్త్‌ క్రీడల్లో షట్లర్‌ లక్ష్యసేన్‌కు గోల్డ్

కామన్వెల్త్‌ క్రీడల్లో షట్లర్‌ లక్ష్యసేన్‌కు గోల్డ్

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సత్తా చాటాడు. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో ఫైనల్ చేరిన 20 ఏళ్ల లక్ష్యసేన్.. మలేషియాకు చెందిన ఎన్జీ టీ యాంగ్‌ను మట్టికరిపించి స్వర్ణాన్ని ఒడిసి పట్టేశాడు. ఫైనల్స్‌లో లక్ష్యసేన్‌ 19–21, 21–9, 21–16 తేడాతో విజయం సాధించాడు. ఇది భారత్ ఖాతాలో చేరిన 20వ స్వర్ణ పతకం కావడం విశేషం.

అంతకుముందు మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్‌తోపాటు పురుషుల సింగిల్స్‌లో కూడా భారత్‌కు స్వర్ణాలు దక్కడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు కామన్వెల్త్ లో భారత్ కు 20 గోల్డ్ పతకాలు లభించాయి. 15 సిల్వర్, 22 బ్రాంజ్ పతకాలతో మొత్తం 57 పతకాలు భారత్ ఖాతాలో వేసుకుంది.