భారత్ లో 90 లక్షలకు చేరువైన కేసులు

భారత్ లో 90 లక్షలకు చేరువైన కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 10,28,203 టెస్టులు చేయగా 45,576  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89,58,484 కు చేరాయి . మరో 585 మంది చనిపోవడంతో కోవిడ్ మరణాలు1,31,578 కి చేరాయి. నిన్న మరో 48,493 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 83,83,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 4,43,303 మంది ఆస్పత్రిలో ఉన్నారు.