న్యూఢిల్లీ: ముంబై ఎయిర్ పోర్టులో రన్ వే పక్కనే కూర్చుని ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సింధియా విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై గురువారం ఆయన మాట్లాడుతూ భద్రతా ఉల్లంఘన జరిగిందని, ఇలాంటి వాటిని సహించబోమన్నారు.
ఈ నెల 14న ఢిల్లీలో పొగమంచు కారణంగా గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ ను ముంబైకి మళ్లించగా.. అక్కడ ప్యాసింజర్లు రన్ వేపైనే కూర్చున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనిపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) సీరియస్ అయ్యి ఇండిగోకు రూ.1.2 కోట్ల ఫైన్, ఎ యిర్ పోర్టు అధికారులకు రూ.30 లక్షల జరిమానా విధించింది.
