
ముంబై: ఇండిగో ఎయిర్‌లైన్స్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఆపరేషన్‌కోసం గుండెను సమయానికి తీసుకువచ్చి ఆదుకుంది. గుజరాత్ నుంచి ముంబైకి గుండెను సకాలంలో చేర్చింది. వడోదరలోని ఆస్పత్రి నుంచి లైవ్ గుండెను ఇండిగో ఫ్లైట్‌లో ముంబైలోని ఆస్పత్రికి 2.30 గంటల్లో సేఫ్ గా తీసుకువచ్చారు. డాక్టర్ల బృందం గుండెను ముంబైలోని ఆస్పత్రికి తరలించినట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. కష్ట సమయంలో పేషెంట్‌కు మద్దతిచ్చినందుకు సిబ్బందిని ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈవో రోనోజాయ్ దత్త మెచ్చుకున్నారు.