ఇండిగో విమానయాన సంస్థకు బిగ్ షాక్.. ఫ్లైట్స్ క్రైసిస్ తో వింటర్ సీజన్ లో ఇండిగో విమానాల షెడ్యూల్ లో కేంద్రం భారీ కోత విధించింది. నిన్న విమాన షెడ్యూల్ 5 శాతం తగ్గించిన డీజీసీఏ.. మంగళవారం (డిసెంబర్ 9) విమాన షెడ్యూల్ లో కోతను10శాతానికి పెంచింది. దీంతో మొత్తం దాదాపు 500 వందల రోజుకు విమాన సర్వీసులు రద్దు కానున్నాయి. సవరించిన షెడ్యూల్ ను ఇండిగో ఎయిర్ లైన్స్ కు అందించింది.
ఇండిగో సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విమాన సర్వీసులను తగ్గించడం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరంగా భావిస్తున్నాం. ఇండిగో విమాన సర్వీసుల్లో 10 శాతం కోత విధించాం. అయితే మునుపటిలాగే అన్ని రూట్లను ఇండిగో సర్వీసులు కవర్ చేస్తాయి. రద్దీ గా ఉండే రూట్లలో మాత్రమే సర్వీసులు రద్దు చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఇండిగో ఎయిర్ లైన్స్ 2200 విమానాలను నడుపుతోంది. తాజా కోతతో ఒక్కరోజులు దాదాపు 500 విమాన సర్వీసులు తగ్గనున్నాయి. ఎక్కువ రద్దీ ఉన్న మార్గాల్లో ఈ విమాన సర్వీసులు తగ్గనున్నట్లు డీజీసీఏ తెలిపింది.
ALSO FREAD : రోస్టరింగ్ వైఫల్యమే కారణం: ఇండిగో సంక్షోభంపై లోక్ సభలో కేంద్రం కీలక ప్రకటన
ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్‌ను మంత్రిత్వ శాఖకు పిలిపించి తాజా మార్పులను అందించింది. గత వారం ఇండిగో క్ర్యూ లిస్టు మెయింటెన్స్, విమాన షెడ్యూల్‌లు, సరిపడా కమ్యూనికేషన్ లేని కారణంగా ఇండిగో అనేక ఇండిగో విమానాలురద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇండిగో క్రైసిస్ పై విచారణ సాగుతోందని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

