అమరావతి: ఇండిగో విమాన సంస్థ ఏపీ ప్రజలకు తీపి కబురు అందించింది. కడప నుంచి ఐదు నగరాలకు తమ సంస్థ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 27న కడప నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడ, మార్చి 29 నుంచి విశాఖ, బెంగళూరుకు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపిన ఇండిగో సంస్థ.. దేశంలో72 నగరాలకు ఇండిగో విమానాలు సేవలు అందిస్తున్నాయని 73వ అనుసంధానంగా కడప నగరం నిలవనుందని చెప్పింది.
From Kadapa to Kadap-wah, book a journey you’ll never forget with IndiGo's 73rd domestic destination. Book now https://t.co/DmMQiSBdCZ.#aviation #LetsIndiGo #Kadapa #New #destination pic.twitter.com/BslhBBFOKc
— IndiGo (@IndiGo6E) February 25, 2022
