రెండు ఇండిగో విమానాలకు బాంబ్ బెదిరింపు

రెండు ఇండిగో విమానాలకు బాంబ్ బెదిరింపు

రెండు ఇండిగో విమానాలకు బాంబ్ బెదిరింపు వచ్చింది.  అక్టోబర్ 14న ఉదయం రెండు విమానాలు ముంబై నుంచి టేకాఫ్ కావాల్సి ఉంది. వాటిలో ఒకటి ముంబై నుంచి (విమానం 6E 1275) మస్కట్‌కు.. మరొకటి (విమానం 6E 56) ముంబై నుంచి  జెడ్డాకు వెళ్లాల్సింది. వెంటనే అప్రమత్తమైన  ఎయిర్ పోర్ట్ అధికారులు విమానాన్ని తనిఖీ చేశారు. ప్రయాణికులందరూ సేఫ్ గా ఉన్నారు. 

ALSO READ : ఢిల్లీలో పాత పెట్రోల్, డీజిల్ వాహనాల ఏరివేత మళ్లీ మొదలు

  మరో వైపు ముంబై నుంచి  న్యూయార్క్‌కు బయల్దేరిన విమానానికి  బాంబు బెదిరింపు రావడంతో వెంటనే   ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ కు  దారి మళ్లించారు అధికారులు. ప్రస్తుతం ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు అధికారులు