ఆర్థికంగా ఎదిగేందుకే మహిళా శక్తి క్యాంటీన్లు : ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

ఆర్థికంగా ఎదిగేందుకే మహిళా శక్తి క్యాంటీన్లు  : ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

పాలకుర్తి/ తొర్రూరు, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ క్యాంటీన్లను ప్రారంభిస్తోందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. గురువారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల ప్రజా పరిషత్​ ఆఫీస్​ ఆవరణలో ఏర్పాటు చేసిన వనిత మహిళా శక్తి క్యాంటీన్​ను ఎమ్మెల్యే కలెక్టర్​ రిజ్వాన్​భాషా షేక్​తో కలిసి ప్రారంభించారు. 

అనంతరం ఎమ్మెల్యే తొర్రూరులో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ వేడుకలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ సాయిలు, పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ నడిగడ్డ శ్రీనివాస్ తో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.