కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లపై ప్రజల దాడి

కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లపై ప్రజల దాడి

మధ్య ప్రదేశ్ ఇండోర్ లో అమానుషం చోటు చేసుకుంది. కరోనా పేషెంట్లకు, అనుమానితులకు ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు వచ్చిన డాక్టర్లపై స్థానికులు దాడి చేయడం కలకలం రేపుతుంది.

ఇండర్ శివారు ప్రాంతమైన తాట్ పత్తీ బక్కల్ ప్రాంతంలో 2కరోనా కేసులు నమోదయ్యాయి. వారితో పాటు స్థానికంగా ఉన్న 54కుటుంబాలకు పరీక్షలు చేసి ఐసోలేషన్ లో ఉంచారు. దీనిపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో ఐసోలేషన్ ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు డాక్టర్లపై నర్సులపై దాడి చేశారు. చేతికి ఏది దొరికితే అది తమపై విసిరేస్తూ కొట్టడం, అస్యభ్యపదజాలంపై అమానుషంగా ప్రవర్తించారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్ పై ప్రాణాలు తెగించి ట్రీట్ మెంట్ చేస్తున్న వైద్యులకు సహకరించాల్సిన ప్రజలే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ..ట్రీట్ చేయనీయకుండా అంతరాయం కలిగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.