భారీ పోలీసు బందోబస్తు మధ్య లగచర్లలో ఇండస్ట్రియల్​ కారిడార్ ​భూసర్వే

భారీ పోలీసు బందోబస్తు మధ్య లగచర్లలో ఇండస్ట్రియల్​ కారిడార్ ​భూసర్వే

కొడంగల్, వెలుగు: వికారాబాద్​ జిల్లా దుద్యాల మండలంలో ఇండస్ట్రియల్​ కారిడార్​ఏర్పాటు కోసం భూసర్వే కొనసాగుతోంది. భూసేకరణకు అంగీకరించిన రైతుల భూముల్లో సర్వే ప్రక్రియ జరుగుతోంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్​ ప్రకారం సోమవారం లగచర్ల, హకీంపేట​ గ్రామాల్లో దాదాపు 85 ఎకరాల పట్టా భూముల్లో అధికారులు సర్వే చేశారు. ఇది వరకు అధికారులపై జరిగిన దాడి ఘటనలు దృష్టిలో ఉంచుకుని భారీ పోలీసు బందోబస్తు మధ్య దుద్యాల తహసీల్దార్​ కిషన్​ ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించారు.

పట్టా భూములకు ఎకరాకు రూ. 23లక్షలు, 150 గజాల ప్లాట్, ఇంటికి రెండు ఉద్యోగాలను ప్రభుత్వం పరిహారంగా ప్రకటించిన విషయం తెలిసిందే. భూముల సర్వే పూర్తయిన తర్వాత, ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకొని, రైతులకు పరిహారం అందించనుంది.