కింగ్ ఈజ్ బ్యాక్ : విరాట్ కోహ్లీ 13 వేల రన్స్.. వన్డేల్లో 47వ సెంచరీ..

కింగ్ ఈజ్ బ్యాక్ : విరాట్ కోహ్లీ 13 వేల రన్స్.. వన్డేల్లో 47వ సెంచరీ..

విరాట్ కోహ్లీ అనేకంటే.. కింగ్ ఈజ్ బ్యాక్ అనొచ్చు.. కొన్నాళ్లు ఫాం కోసం తీవ్రంగా కష్టపడుతున్న విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టాడు. సెంచరీతో చెలరేగాడు. పాకిస్తాన్ బౌలర్లను చితక్కొట్టాడు. 84 బంతుల్లోనే వంద పరుగుల చేసి.. బ్యాంటింగ్ లో మరోసారి తన సత్తా చాటాడు. వన్డే మ్యాచుల్లో 47వ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో వేగంగా 13 వేల పరుగులు చేసిన ఆటగాడుగా రికార్డ్ క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ.

ప్రపంచ వ్యాప్తంగా వన్డేల్లో 13వ వేల పరుగులు చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఐదో ఆటగాడిగా నిలిచాడు. 

  • మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నారు. 452 ఇన్నింగ్స్ లో 18 వేల 426 పరుగులు చేశారు
  • రెండో స్థానంలో కూమర సంగక్కర ఉన్నారు.. 380 ఇన్నింగ్స్ లో 14 వేల 234 పరుగులు చేశారు
  • మూడో స్థానంలో రికీ పాంటింగ్ ఉన్నారు.. 365 ఇన్నింగ్స్ ఆడి.. 13 వేల 704 రన్స్ చేశారు
  • నాలుగో స్థానంలో సనత్ జయసూర్య ఉన్నారు.. 433 ఇన్నింగ్స్ ఆడి 13 వేల 430 పరుగులు చేశారు
  • ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు.. కేవలం 267 ఇన్నింగ్స్ ఆడి.. 13 వేల పరుగులు పూర్తి చేశారు. 

పైన ఉన్న నలుగురు ఆటగాళ్లు రిటైర్ అయిపోయారు. విరాట్ కోహ్లీ ఇంకా ఆడుతుండటంతో.. రాబోమే మ్యాచుల్లో మొదటి స్థానానికి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎంత లేదన్నా రెండో స్థానానికి మాత్రం కచ్చితంగా వస్తాడు కోహ్లీ.. అది కూడా ఈ ఏడాదిలోనే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.