ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీచైతన్య లాభం రూ.100 కోట్లు

ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీచైతన్య లాభం రూ.100 కోట్లు

హైదరాబాద్, వెలుగు: 2025 నాటికి రూ.500 కోట్ల కంపెనీగా అవతరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీ చైతన్య వ్యవస్థాపక సీఈవో ఉజ్వల్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు 2023, మార్చి 31తో ముగిసిన కంపెనీ ఫైనాన్షియల్ రిజల్ట్స్​ను ఆయన ప్రకటించారు.  2021–22లో రూ.2.3 కోట్లుగా ఉన్న లాభం.. 2022–23లో రూ.100 కోట్లకు పెరిగింది.  ఎడ్యుకేషన్ సెక్టార్​లో మరిన్ని సరికొత్త ఆవిష్కరణలు చేపడ్తామని ప్రకటించారు. 

ఎడ్​టెక్ సెక్టార్​లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్నామని వివరించారు. ఇన్ఫినిటీ లెర్న్​కు 7.50లక్షల మందికి పైగా సబ్​స్ర్కైబర్లు ఉన్నారని, 7 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ తమ కంటెంట్​ను యాక్సెస్ చేస్తున్నారని తెలిపారు. 2025 నాటికి 5 కోట్ల స్టూడెంట్లు తమ కంటెంట్ యాక్సెస్ చేసుకునేలా, 10 లక్షల పెయిడ్ లెర్నర్స్ కు సేవలందించేలా టార్గెట్ పెట్టుకున్నామని వివరించారు.