ఈ చార్జర్‌తో జస్ట్ 10 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్

ఈ చార్జర్‌తో జస్ట్ 10 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్

బీజింగ్: హాంకాంగ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీ  ఇన్‌ఫినిక్స్. ఈ సంస్థ కొత్తగా హైఎండ్ ఫోన్‌ను తీసుకురాబోతోంది. దీంట్లో పెద్ద విశేషం ఏముందంటారా? అద్భుతమైన ఫీచర్లతో కాన్సెప్ట్ ఫోన్‌ను తీసుకొస్తున్న ఇన్‌ఫినిక్స్.. దీంతోపాటు ఓ ఫాస్ట్ చార్జర్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. 160 వాట్ల ఈ చార్జర్‌‌తో 4 వేల ఎంఏహెచ్ ఫోన్‌ కూడా పది నిమిషాల్లో ఫుల్ చార్జ్ అయిపోతుంది. వేగంగా చార్జ్ చేయడం కోసం ఇందులో 8సీ అనే బ్యాటరీని వినియోగించారు. అలాగే యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ నుంచి వోల్టేజీని కన్వర్ట్ చేసేందుకు సూపర్ చార్జ్ పంప్‌‌ను కూడా వాడారు. 98.6 శాతం యాక్యూరసీతో పని చేసే ఈ సూపర్ పంప్.. కన్వర్షన్ రేట్‌లో ఒప్పో 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం.