సాగర్ కు 5.80 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో

సాగర్ కు 5.80 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ 5,88,743 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీంతో  24 గేట్లను 15 అడుగులు, 2 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 5,45,884 క్యూసెక్కుల నీటిని డ్యామ్ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.  

సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 585.80 అడుగులు(299.7430  టీఎంసీలు)కు చేరింది. కుడి కాల్వకు 8,529, హైదరాబాద్ జంట నగరాల తాగునీటికి ఏఎమ్మార్పీకి 2,400, వరద కాల్వకు 300, విద్యుత్​ ఉత్పత్తికి 33, 130  క్యూసెక్కుల  చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.  - హాలియా, వెలుగు