నాగార్జున సాగర్‌‌ కు తగ్గిన ఇన్‌‌ఫ్లో

నాగార్జున సాగర్‌‌ కు తగ్గిన ఇన్‌‌ఫ్లో

హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌ రిజర్వాయర్‌‌కు ఇన్‌‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి 83,848 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో సాగర్‌‌ వద్ద నాలుగు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌‌ నుంచి ఎడమకాల్వకు 7,272 క్యూసెక్కులు, కుడి కాల్వకు 10,040, ఏఎమ్మార్పీకి 600, విద్యుత్​ ఉత్పత్తి ద్వారా 33,536 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.