రూ.15 కోట్లు తగ్గిన ఇన్ఫోసిస్ సీఈవో జీతం

రూ.15 కోట్లు తగ్గిన ఇన్ఫోసిస్ సీఈవో జీతం

ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వేతనం భారీగా పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.15 కోట్లు తక్కువ పరిహారం అందుకున్నాడు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.71 కోట్ల పరిహారం అందుకున్న సలీల్ పరేఖ్.. 2022-23లో రూ.56.44 కోట్లకు పరిమితమయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పరేఖ్ పరిహారం 21 శాతం తగ్గిందని ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో తెలిపింది.

పరేఖ్ జీతంలో మూల వేతనం రూ. 6.67 కోట్లు కాగా, రిటైర్‌మెంట్ ప్రయోజనాలు రూ. 45 లక్షలు, వేరియబుల్ వేతనం రూ.18.73 కోట్లుగా ఉంది. అలాగే తన నియంత్రిత స్టాక్ యూనిట్ల(ఆర్‌ఎస్‌యు)ను వినియోగించడం ద్వారా రూ.30.6 కోట్లు సంపాదించారని ఇన్ఫోసిస్ తెలిపింది. పరేఖ్ ఈ ఏడాది అనగా తక్కువ పరిహారం అందుకోవడానికి ప్రధాన కారణం ఆర్‌ఎస్‌యులు. ఆర్‌ఎస్‌యు అనేది ఉద్యోగులకు అందించే ఈక్విటీ పరిహరనికి సంభదించిన ఒక రూపం.