ఇన్ఫోసిస్‌‌పై జాతి వివక్ష కేసు

ఇన్ఫోసిస్‌‌పై జాతి వివక్ష కేసు

న్యూఢిల్లీ: జాతి వివక్షను చూపుతోందంటూ ఐటీ సర్వీసుల కంపెనీ ఇన్ఫోసిస్‌‌పై అమెరికాలో కేసు నమోదయింది. ఈ కంపెనీ మాజీ ఉద్యోగి ఈ కేసును ఫైల్‌‌ చేశారు. 2016 లో కంపెనీకి వ్యతిరేకంగా దాఖలైన క్లాస్‌‌ యాక్షన్‌‌ సూట్‌‌లో ఇన్ఫోసిస్‌‌కు వ్యతిరేకంగా ఆఫ్రికన్‌‌–అమెరికన్‌‌ డవీనా లింగిస్ట్‌‌ కోర్టులో సాక్ష్యం చెప్పారు.   కంపెనీ తనపై ప్రతీకారం తీర్చుకుంటోందని ఆరోపించారు. 2017 లో తన జాబ్‌‌కు ఆమె రాజీనామా చేశారు. తాజాగా ఈ కంపెనీపై జాతి వివక్ష కేసును కోర్టులో ఆమె  ఫైల్‌‌ చేశారు.  లోకల్స్‌‌కు జాబ్స్‌‌ ఇవ్వకుండా వీటిని దక్షిణ ఆసియా వర్కర్లతో నింపుతోందని జాబ్​ అప్లికెంట్​ బ్రెండా కోలర్‌‌‌‌ తాజాగా కంపెనీపై కేసు ఫైల్‌‌  చేశారు.  ఈ కేసులో కూడా లింగిస్ట్‌‌ సాక్ష్యం చెప్పారు.  జాతి వివక్ష కేసు గురించి విన్నామని ఇన్ఫోసిస్‌‌ ప్రకటించింది. జాతి వివక్షకు పాల్పడలేదని, ఎటువంటి ప్రతీకార చర్యలను తీసుకోలేదని చెప్పింది. కంపెనీ కొన్ని పాలసీలకు అనుగుణంగా పనిచేస్తుందని, వీటి ప్రకారం అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని పేర్కొంది.