పేద విద్యార్థినులకు రూ.100 కోట్ల స్కాలర్ షిప్.. ​ఫండ్స్ రిలీజ్​ చేసిన ఇన్ఫోసిస్​

పేద విద్యార్థినులకు రూ.100 కోట్ల స్కాలర్ షిప్.. ​ఫండ్స్ రిలీజ్​ చేసిన ఇన్ఫోసిస్​

పేదరికం చదువుకు అడ్డుకావొద్దని వివిధ చేయూత కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్ విద్యార్థినులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. ప్రముఖ విద్యా సంస్థల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్​(స్టెమ్)లో ఉన్నత విద్యా అభ్యసించాలనుకుంటున్న  ఆర్థికంగా బలహీన వర్గాల్లోని విద్యార్థినులకు స్టెమ్​స్టార్స్​ స్కాలర్​షిప్స్ ఇచ్చేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ తెలిపింది. 

ఫస్ట్​ఫేజ్​లో దేశవ్యాప్తంగా ప్రసిద్ధ కాలేజీల్లో సీట్లు పొందిన 2 వేల మంది అమ్మాయిలకు నాలుగేళ్ల పాటు స్కాలర్​షిప్​ అందినవ్వనుంది. హాస్టల్, స్టడీ మెటీరియల్స్, ట్యూషన్ ఫీజులు తదితర ఖర్చుల కోసం ఏటా రూ.లక్ష వరకు వీరికి ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇన్ఫీ పేర్కొంది. 

దేశంలో పేదరికంలో ఉన్న యువత తాము కోరుకున్న హైయర్​ ఎడ్యుకేషన్​ చదవలేకపోతున్నారని.. ఈ ప్రభావం బాలికలపై ఎక్కువంగా ఉందని ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ ట్రీస్టీ సుమిత్​ విర్మానీ తెలిపారు. 

ఫస్ట్​ఇయర్​లో నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ర్యాంకింగ్​ ఫ్రేమ్​వర్క్​గుర్తింపు ఉన్న విద్యాలయాలు అంటే ఐఐటీలు, బిట్స్ పిలానీ, నిట్, ప్రసిద్ధ మెడికల్​ కాలేజీల్లో చదివే వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ తెలిపింది.