కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్-పాక్‌‌ చర్చలు జరిపాలి

కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్-పాక్‌‌ చర్చలు జరిపాలి

శ్రీనగర్: లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శుక్రవారం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దాయది పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి దాడుదలకు తెగబడింది. పాక్ కాల్పుల్లో నలుగురు పౌరులతోపాటు నలుగురు ఆర్మీ సైనికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. పాకిస్తాన్ వైపు 20 మందికి పైగా జవాన్లు మృతి చెంది ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో భారత్-పాక్‌‌లు చర్చలు జరపాలని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సూచించారు. రాజకీయ విభేదాలు, వైరుధ్యాలను పరిష్కరించుకోవడానికి ఇరు దేశాలు చర్చలు జరిపితే బాగుంటుందని మెహబూబా అన్నారు.

‘ఎల్‌‌వోసీకి ఇరు వైపులా పెరుగుతున్న ప్రాణనష్టం విచారకరం. భారత్-పాక్‌‌ నాయకత్వాలు తమ రాజకీయ వైరుధ్యాలను పక్కనబెడితే చర్చలను ప్రారంభించొచ్చు. వాజ్‌‌పేయి జీ-ముషారఫ్ సాబ్‌‌ల హయాంలో అంగీకరించిన, అమలు చేసిన కాల్పుల విరమణను పునరుద్ధరించాల్సిన టైమ్ వచ్చింది’ అని మెహబూబా ట్వీట్ చేశారు.