
అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ వన్యమృగం చనిపోయింది. రాజస్థాన్ లోని అల్వార్ సరిస్కా టైగర్ రిజర్వ్ లోని ఓ పులి(ST-16) మరణించింది. గాయాలతో ఉన్న ఆ పులికి చికిత్సను అందించేందుకు అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ పులి 2-3 కిలోమీటర్లు నడిచింది. చివరకు ఒకచోట కుప్పకూలిపోయి చనిపోయింది. అధికారులు మాత్రం తాము సాధారణ డోస్ మాత్రమే ఇచ్చామని, పులి ఏ కారణంగా చనిపోయిందో తెలియదంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో పులి మరణానికి కారణం తెలుస్తుందని సరిస్కా టైగర్ రిజర్వ్ అధికారులు వెల్లడించారు.