
ఉత్తర ప్రదేశ్ హత్రాస్ లో హత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్‌కు ఇవాళ(సోమవారం) అనుకోని ఘటన ఎదురైంది. హత్రాస్ గ్రామంలో బాధితురాలి ఇంటిలో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి సంజయ్ సింగ్ బయటకు రాగానే గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై ఇంకు చల్లాడు. నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పార్టీ నేతలతో కలిసి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.
సింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా దుండగుడు ఆయనపై ఇంకు చల్లాడు. హత్రాస్‌లో దళిత యువతిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. హత్రాస్‌లో పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఈ మంగళవారం చనిపోయింది.